వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంక్ కి మెగా స్టార్, మెగా పవర్ స్టార్ ఇద్దరూ చీఫ్ గెస్ట్ లు అనే విషయం తెలిసిందే. అయితే ఈ ఫంక్షన్ ఎక్కడ జరపాలి, అభిమానుల్ని పిలవాలా వద్దా అనే విషయంపైనే తర్జన భర్జన పడుతున్నారు దర్శక నిర్మాతలు. చివరకు ఈ విషయాన్ని పవన్ కల్యాణ్ కే వదిలేశారు. ఏపీలో ఫంక్షన్ పెట్టుకుంటే ఎలా ఉంటుంది, లేదా హైదరాబాద్ లో ఏదైనా హోట్ లో పని పూర్తి చేస్తే ఎలా ఉంటుందనే విషయం తేలాల్సి ఉంది. ఒకవేళ ఫంక్షన్ ఎక్కడ పెట్టినా అభిమానులు లేకపోతే సందడే ఉండదు. కరోనా ముప్పు ఉన్న ఈ సందర్భంలో అభిమానులతో గ్రాండ్ ఫంక్షన్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అని పవన్ ఆలోచనలో పడిపోయారట.