తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోయిన్ కాజల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తనదైన నటనతో కోట్లాది మంది ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకుంది ఈ భామ. చందమామ సినిమాతో తెలుగు ప్రేక్షకులను తనవైపు తిప్పుకుంది అందాల తార కాజల్ అగర్వాల్. ఇక 14 ఏళ్ల కెరీర్లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించిందీ అమ్మడు.