నవీన్ పొలిశెట్టి కి ఇంత మంచి క్రేజ్ ను సంపాదించి పెట్టిన జాతిరత్నాలు సినిమా, తన లైఫ్లో ఒక చెరగని ముద్ర వేస్తుంది. ఇక ఈ సినిమా హిట్ ఇచ్చిన కారణంగా నవీన్ పొలిశెట్టి తన రెమ్యూనరేషన్ కూడా పెంచేశాడు. ఇక ఎలాగో పలువురు ప్రముఖ దర్శక నిర్మాతలు, నవీన్ పొలిశెట్టి తో సినిమా తీయాలని ఆలోచనలో కూడా పడ్డారు. ఇప్పటికే "రారా కృష్ణయ్య " దర్శకుడు మహేష్ తో ఒక సినిమా చేసేందుకు నవీన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.అయితే ఈ చిత్రంలో నటించేందుకు నవీన్ పొలిశెట్టి ఏకంగా రెండు కోట్ల రూపాయల పారితోషికం డిమాండ్ చేశాడట. ఇక నిర్మాతలు కూడా అంత రెమ్యునరేషన్ ఇవ్వడానికి కూడా వెనుకాడడం లేదట. ఏది ఏమైనా ఈ సినిమా కూడా మరో హిట్ ను సాధిస్తే, మన నవీన్ పొలిశెట్టి మరింత పారితోషికాన్ని డిమాండ్ చేసే అవకాశాలు లేకపోలేదని విశ్వసనీయ వర్గాల సమాచారం..