కోలీవుడ్ స్టార్ హీరో కార్తిక్ శివకుమార్, రంజనీ దంపతులు 2020 అక్టోబర్ లో ఒక అబ్బాయికి జన్మనిచ్చిన సంగతి తెలిసిందే.. అయితే కేవలం "మేము ఒక అబ్బాయికి జన్మనిచ్చాము " అని మాత్రమే సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు కార్తిక్. కానీ ఇప్పుడు అభిమానుల కోసం తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ ద్వారా తన కొడుకు పేరు ను రివీల్ చేశాడు. అందులో భాగంగానే... " నేను, మీ అమ్మ, మీ సోదరి నీకు ఎంతో ప్రేమతో నీకు "కందన్ " అని పేరు పెట్టాము. నీ రాకతో మా జీవితాలు మరింత మధురంగా మారిపోయాయి.. " అంటూ రాసుకొచ్చాడు హీరో కార్తి.. ఇక తన కొడుకు పేరును ఇంస్టాగ్రామ్ అకౌంట్ ద్వారా అనౌన్స్ చేసిన వెంటనే కార్తీక్ కు సినీ ప్రముఖులతో పాటు అభిమానుల నుంచి కూడా అభినందనలు కూడా వెల్లువెత్తుతున్నాయి..