చిరంజీవి హీరోగా నటించిన ఆచార్య సినిమాను మే 13, 2021న విడుదల కాబోతుంది. ఓవర్సీస్ మార్కెట్ కూడా సాధారణ స్థితికి రావటంతో మంచి వసూళ్లను సాధించవచ్చని ఆచార్య చిత్రబృందం ఆశాభావం వ్యక్తం చేస్తోంది. కానీ ఆచార్య నిర్మాతల ఆశలపై సల్మాన్ ఖాన్ నీళ్ళు చల్లబోతున్నారు. సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న రాదే సినిమాపై ఏ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఆ సినిమా కూడా మే 13వ తేదీన విడుదలకు సిద్ధమయింది.