తెలుగు చిత్ర పరిశ్రమలో హీరో రానా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. లీడర్ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైయ్యాడు రానా. ఆయన చేసిన సినిమాలు తక్కువే అయినా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కమర్షియల్ గా హిట్టయ్యే సినిమాల కంటే నటుడిగా మంచి పేరు తెచ్చిపెట్టే సినిమాలనే రానా ఎక్కువగా ఎంపిక చేసుకుంటూ ఉండటం గమనార్హం.