రంగ్ దే ట్రైలర్ వచ్చేసింది. హీరో నితిన్, హీరోయిన్ కీర్తి సురేష్ మధ్య గిల్లికజ్జాలతో ట్రైలర్ మొత్తం ఆసక్తికరంగా సాగింది. మధ్య మధ్యలో రెండు మూడు యాక్షన్ సీన్స్ ఉన్నా కూడా మెయిన్ విలన్ గా ఎవర్నీ చూపించలేదు. సో.. రంగ్ దే లో అసలు విలనే ఉండరు అనే విషయం ప్రూవ్ అయింది. ఒకరకంగా హీరో పాలిట, హీరోయిన్, హీరోయిన్ పాలిట హీరోయే అప్పుడప్పుడు విలన్లుగా మారిపోతారనమాట. అయితే విలన్ లేని సినిమాతో నితిన్ ఎంగేజ్ చేస్తాడా లేదా అనేదే తేలాల్సి ఉంది.