కాజల్ అగర్వాల్.. ఈ జనరేషన్ లో రామ్ చరణ్ తో" మగధీర, నాయక్, గోవిందుడు అందరివాడేలే" అనే సినిమాలో జోడిగా నటించింది. ఇక సూపర్ హిట్ పెయిర్ గా పేరు ప్రఖ్యాతులు కూడా అందుకుంది. ఇక ఆ తర్వాత రామ్ చరణ్ తండ్రి చిరంజీవి రీ ఎంట్రీ మూవీ ఖైదీ నెంబర్ 150 లో చిరంజీవి సరసన హీరోయిన్ గా నటించి, అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.. అంతేకాకుండా ప్రస్తుతం ఆచార్య సినిమాలో మరోసారి చిరంజీవి కి జోడిగా నటిస్తోంది..అంతే కాకుండా కాజల్ అగర్వాల్ అక్కినేని ఫ్యామిలీతో కూడా కలిసి నటించి రికార్డు సృష్టించింది. అంటే నాగచైతన్యతో దడ సినిమాలో కలిసి నటించి, తాజాగా నాగార్జున, ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో చేస్తున్న సినిమాలో కాజల్ అగర్వాల్ నాగార్జున సరసన నటిస్తోంది. అయితే ఈ జనరేషన్ లో కూడా తండ్రీ కొడుకులతో కలిసి నటించిన ఏకైక హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ రికార్డులోకేక్కింది..