రాహుల్ సిప్లిగంజ్ 'చిచ్చా' పై మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. సినిమా టైటిల్ బాగుంది. చిచ్చా తెలంగాణ బ్రాండ్‌ను ప్రమోట్ చేసేలా ఉంది. రాహుల్ మన తెలంగాణ బిడ్డ. ఈ సినిమా మంచి హిట్ అవ్వాలి. మొదటి సినిమాకు ఎలాంటి సాయం కావాలన్నా కూడా నేను చేస్తాను. ఇండస్ట్రీలో సూపర్ స్టార్ రేంజ్‌కు ఎదగాలి. బిగ్ బాస్ షోను ఎలా హిట్ చేశాడో.. సినిమాను కూడా అంతే హిట్ అయ్యేలా చేయాలని కోరుకుంటున్నా అంటూ అన్నారు. చిచ్చా పాట చాలా బాగుంది. తెలంగాణ యాసలో వస్తున్న ఈ పాట తెలంగాణ ఖ్యాతిని పెంచుతున్నాయి. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను ప్రకటించనున్నట్లు వెల్లడించారు.