మహారాష్ట్రలో కరోనా విజృంభిస్తోంది. కరోనా మొదలైన తర్వాత ఇప్పటి వరకూ ఒకరోజు అత్యథిక కేసులు శనివారం నమోదయ్యాయి. తొలి దశ కంటే రెండో దశ మరింత ప్రభావం చూపుతోందనడానికి ఇంతకంటే పెద్ద ఉదాహరణ ఇంకేమీ అక్కర్లేదు. మొత్తం దేశవ్యాప్తంగా నమోదయ్యే కేసుల్లో 62శాతం కేసులు మహారాష్ట్రలోనే వెలుగు చూస్తున్నాయి. దీంతో మహారాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకోబోతున్నట్టు తెలుస్తోంది. పూర్తిగా లాక్ డౌన్ అమలు చేస్తారని థియేటర్లు, స్కూల్స్ మూత పడతాయని అంటున్నారు. ఈ వార్తలు నిజమైతే.. దాని ప్రభావం తెలుగు రాష్ట్రాలపై కూడా ఉంటుంది.