మహేష్ బాబు ఎప్పుడూ కొత్త దర్శకులతో ప్రయోగాలు చేయరు. హిట్ కొట్టిన దర్శకులకే అవకాశం ఇస్తుంటారు. కనీసం ఫ్లాపుల్లో ఉన్నవారిని కూడా పలకరించరు అనే అపవాదు కూడా ఉంది. అయితే ఇప్పుడాయన ఓ కొత్త దర్శకుడితో ప్రయోగం చేయబోతున్నట్టు వార్తలొస్తున్నాయి. దీనికి సంబంధించి మహేష్ టీమ్ మీడియాకు లీకులిచ్చిందని, అసలు మహేష్ నిర్ణయంపై ఎవరేమనుకుంటున్నారో తెలుసుకోవాలన్నదే వారి ప్రధాన ఉద్దేశమని అంటున్నారు.