ఇటీవల జరిగిన ఒక ఇంటర్వ్యూలో నటి సూజ వరుణీ మాట్లాడుతూ.. నేను దృశ్యం మొదటి భాగాన్ని అన్ని భాషల లో చూశాను. అలాగే రెండవ భాగం మలయాళం లో చూసి, దర్శకుడైన జీతు జోసెఫ్ ఇంత అద్భుతమైన స్క్రిప్ట్ ను ఎలా తయారు చేశాడు అని ఆశ్చర్యపోయాను. అంతేకాకుండా ఇంతటి అద్భుతమైన ప్రాజెక్టులో నేను ఒక భాగం ఎందుకు కాలేకపోయాను అని కూడా బాధపడ్డాను. కానీ దృశ్యం రీమేక్ లో ఒక పాత్ర కోసం నన్ను ఎంచుకున్నప్పుడు చాలా సంతోషం అనిపించింది..