హీరోయిన్ గజాలా టీవీ నటుడు ఫైజల్ రజా ఖాన్ ను పెళ్లి చేసుకొని ముంబైలో స్థిరపడిపోయింది. అయితే అతను టీవీ సీరియల్స్ కు దర్శకత్వం వహిస్తూ ఉంటాడు. ఇక అందులో భాగంగానే తన భర్త దర్శకత్వంలో సీరియల్స్ లో నటించాలని భావిస్తోంది గజాల. ప్రస్తుతం ఈమె కుటుంబం మొత్తం కువైట్లో స్థిరపడిపోయింది. ఏది ఏమైనా ఆమె భర్త ఒప్పుకుంటే, త్వరలోనే బుల్లితెరపై వస్తోన్న ధారావాహికలలో ప్రధాన పాత్రలో మనకు కనిపించబోతోంది అన్నమాట.. అయితే వెండితెరపై ప్రేక్షకులను తన అందంతో,ఆహార్యం, సమయస్ఫూర్తితో ప్రేక్షకులను కట్టిపడేసిన ఈ భామ, ఇక సీరియల్స్ లో ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటుందో వేచి చూడాల్సిందే..