బుచ్చిబాబు సనా తన సొంతంగా ఏ సినిమాని డైరెక్ట్ చేసేందుకు సిద్ధమవడం లేదట. స్వయంగా సుకుమారే ఒక ప్రాజెక్టు వెతికిపెట్టిన తరువాతనే బుచ్చిబాబు తన తదుపరి చిత్రాన్ని ప్రకటిస్తారా? అనేది కాలమే చెప్పాలి కానీ ప్రస్తుతం ఈ విషయమై ఓ సందేహం ఉత్పన్నమవుతోంది. అదేంటే బుచ్చిబాబు సూర్య ప్రతాప్ అడుగుజాడల్లో నడుస్తారా లేక సుకుమార్ సామ్రాజ్యం నుంచి బయటికి వెళ్ళి తన సొంతంగా సినిమాలు డైరెక్ట్ చేసుకుంటారా? అని పలువురు సందేహం వ్యక్తం చేస్తున్నారు.