శ్రీ సింహా కథానాయకుడిగా మణికాంత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ 'తెల్లవారితే గురువారం'. మిషా నారంగ్, చిత్ర శుక్ల కథానాయికలు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా మార్చి 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఆదివారం చిత్ర ప్రీరిలీజ్ వేడుక నిర్వహించారు.. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎన్టీఆర్ చిత్ర థియేట్రికల్ ట్రైలర్ను విడుదల చేశారు. ఇందులో శ్రీసింహా-సత్యల మధ్య సన్నివేశాలు నవ్వుల పువ్వులు పూయిస్తున్నాయి. తెల్లవారితే పెళ్లి జరగాల్సిన ఓ యువకుడి జీవితంలో ఏం జరిగిందన్న కథాంశంతో 'తెల్లవారితే గురువారం' తీర్చిదిద్దారు. కాలభైరవ స్వరాలు సమకూర్చిన ఈ చిత్రాన్ని వారాహి చలన చిత్రం, లౌక్య ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.