యంగ్ హీరో నితిన్.. తనని తాను యంగ్ స్టర్ అనుకోవట్లేదట. అంతే కాదు, తాను కాలేజీ లవ్ స్టోరీలకు ఇక సెట్ కాను అని డైసైడ్ అయిపోయాడట. అయితే రంగ్ దే స్టోరీలైన్ విన్న తర్వాత నితిన్ కష్టపడి కాలేజీ కుర్రాడి గెటప్ లోకి మారేందుకు కష్టపడ్డాడట. ఆ కష్టానికి తగ్గ ఫలితం తెరపై చూస్తారని అంటున్నాడు హీరో నితిన్. రంగ్ దే మూవీలో సరికొత్త నితిన్ ని చూస్తారని చెబుతున్నారు.