ఇటీవల సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్లతో చాలామంది ప్రముఖులు ఇబ్బందులు పడుతున్నారు. ఆల్రడీ సోషల్ మీడియాలో అకౌంట్ ఉండి, అఫిషియల్ టిక్ మార్క్ తో ఉంటే... దాన్నే అభిమానులంతా ఫాలో అవుతుంటారు. అసలు సోషల్ మీడియాలోకి రాని స్టార్స్ కే ఇబ్బందంతా. తాజాగా ఈ లిస్ట్ లో ఉప్పెన హీరో వైష్ణవ్ తేజ్ కూడా చేరారు. సోషల్ మీడియాలో తన పేరుతో కొన్ని ఫేక్ అకౌంట్లు వెలుగులోకి వస్తున్నాయని, వాటిపై పోలీసులకు రిపోర్ట్ ఇస్తానని అన్నారు. అలాంటి ఫేక్ అకౌంట్లను అభిమానులు ఫాలో కావద్దని సూచించారు.