గతంలో వచ్చిన లాక్ డౌన్ కే దాదాపు 10 వేల కోట్లకు పైగా నష్టపోయింది సినిమా ఇండస్ట్రీ.తెలుగు రాష్ట్రాలు మినహా ఇప్పటికీ కొన్ని రాష్ట్రాల్లో థియేటర్స్ సరిగ్గా ఓపెన్ చేయలేదు.. మన దగ్గర పరిస్థితి ఇప్పుడిప్పుడే చక్కబడుతుందనుకునే సమయానికి మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి.క్రాక్, జాతి రత్నాలు లాంటి బ్లాక్‌బస్టర్స్‌తో సహా.. నాంది, మాస్టర్ లాంటి విజయాలు వచ్చాయి ఈ ఏడాది.ఏపీ, తెలంగాణలో కూడా కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. దాంతో రెండు ప్రభుత్వాలు కూడా లాక్ డౌన్ దిశగా అడుగులు వేస్తున్నాయనే వార్తలు వస్తున్నాయి.. కొన్ని రాష్ట్రాల్లో సినిమాలు అనే మాట ఆమడ దూరంలో ఉంది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో వకీల్ సాబ్, ఆచార్య, కేజీయఫ్ 2, రాధే శ్యామ్ వంటి స్టార్ మూవీ పరిస్థితి ఊహకు అందని విధంగా మారింది.