తెలుగు చిత్ర పరిశ్రమలో అలనాటి నటుడు కత్తి కాంతారావు గురించి తెలియని వారంటూ ఉండరు. తనదైన నటనతో ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసుకున్నాడు. కేవలం జానపద హీరోగానే కాకుండా.. పౌరాణిక పాత్రల్లో నారదుడిగా తెలుగు ప్రేక్షకులను అలరించాడు. ఎన్నో జానపద, పౌరాణిక, సాంఘిక చిత్రాల్లో కథానాయకుడిగా తెలుగు తెరపై చెరగని ముద్ర వేసిన అనితర సాధ్యుడిగా పేరు సంపాదించాడు.