మలయాళ స్టార్ మోహన్‌లాల్ కథానాయకుడిగా బి. ఉన్నికృష్ణన్ తెరకెక్కిస్తోన్న 'ఆరాట్టు' చిత్రంలో నటిస్తున్నారు రెహమాన్..ఈ సినిమాలో ఆయన గెస్ట్ రోల్ లో కనిపించనున్నారు. ఈ విషయాన్ని సామాజిక మాధ్యమాల వేదికగా తాజాగా అభిమానులతో పంచుకున్నారు మోహన్‌లాల్. ఈ మేరకు సెట్లో రెహమాన్, దర్శకుడితో దిగిన ఫొటోను షేర్ చేశారు. 'అరుదైన, ఎప్పటికీ గుర్తుండిపోయే షూట్ ఇది' అని పేర్కొన్నారు.యాక్షన్ కామెడీ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాలో శ్రద్ధా శ్రీనాథ్ నాయిక.హిప్పో ప్రైమ్ మోషన్ పిక్చర్స్, మూవీ పే మీడియాస్ ఆర్డీ ఇల్యుమినేషన్స్ సంస్థలు నిర్మిస్తున్నాయి. ఈ మధ్యనే వచ్చిన తమిళ చిత్రం 'బిగిల్'లోని ఓ పాటలో ఆయన కన్పించారు.