అక్టోబర్ 13వ తేదీన ఆర్ఆర్ఆర్ సినిమాను రిలీజ్ చేస్తామని చిత్ర బృందం ప్రకటించింది. ఐతే సినిమా రిలీజ్ కావడానికి ఇంకా 6 నెలల సమయం ఉన్నప్పటికీ.. అప్పుడే ఫ్రీ రిలీజ్ బిజినెస్ వందల కోట్లలో జరుగుతోంది. ఆర్ఆర్ఆర్ మూవీ డిజిటల్ రైట్స్ తో పాటు సాటిలైట్ రైట్స్ 225 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయాయట. ఒక ప్రముఖ మీడియా సంస్థ ఆర్ఆర్ఆర్ చిత్రం యొక్క తెలుగు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ సాటిలైట్, డిజిటల్ హక్కులను 225 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసిందని నివేదికలు పేర్కొంటున్నాయి.