1962లో వి.మధుసూధనరావు దర్శకత్వంలో సావిత్రి హీరోయిన్ గా ఆరాధన సినిమా నిర్మించాడు. కానీ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద యావరేజ్ గా నిలిచింది.ఇదే టైటిల్ తో భాస్కర చిత్ర బ్యానర్ పై 1976లో వి వి ప్రసాద్ దర్శకత్వంలో ఎన్టీరామారావు , వాణిశ్రీ లు హీరో హీరోయిన్లుగా నటించారు. ఇందులోని ఒక పాట ద్వారా (నా మది నిన్ను పిలిచింది గానమై వేణు గానమై)ఎంత హిట్ సంపాదించిందో మనం చెప్పక్కర్లేదు కదా.. పాటలు బాగా ఉండడంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద విజయం సాధించింది.1987లో ఇదే సంవత్సరంలో గీతా ఆర్ట్స్ బ్యానర్ పై ఆరాధన సినిమా ఫ్లాప్ గా నిలిచింది. అంతేకాకుండా ఈ సినిమాలో "అరే ఏమైంది ఈ వయసుకు రెక్కలొచ్చి ఎక్కడికో ఎగిరింది". అనే పాట హిట్ అయిన ఆరాధన సినిమా మాత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది.