బుల్లితెర యాంకర్ సుమ కనకాల గురించి తెలియని వారంటూ ఉండరు.తనదైన నటనతో కోట్లాది మంది తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకుంది సుమ. అలా టీవీలో షోస్ చేస్తూ, ఆడియో ఫంక్షన్ కి యాంకరింగ్ చేస్తూ, అంతే కాకుండా ఈ మధ్య యూట్యూబ్ లో కూడా మనందరినీ అలరిస్తున్న సుమ ఇంత ఎత్తుకు ఎదగడం వెనుక ఎన్నో కష్టాలు ఉన్నాయట. కొన్ని సంవత్సరాల క్రితం ఒక సమయంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు అట. అప్పుడే అవాక్కయ్యారా షో ద్వారా సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టారట సుమ.