సినిమాలు విడుదలై, వాటికి ప్రేక్షకాదరణ ఉండి, కొన్నిసార్లు విమర్శకుల ప్రశంసలు అందుకుంటే.. అలాంటి వాటికి అవార్డులు కూడా వస్తాయి. అయితే అసలు విడుదల కాని సినిమాకి అవార్డు ప్రకటించడంతో సినీ అభిమానులు అవాక్కయ్యారు. అది కూడా నేషనల్ అవార్డు. అవును మలయాళ మూవీ మరక్కార్ కి విడుదల కాకముందే 67వ జాతీయ పురస్కారాల్లో స్థానం లభించింది. అయితే ఆ సినిమా ఇంకా థియేటర్లలోకి రాలేదు. అయినా కూడా దానికి అవార్డు ఇవ్వడంతో జ్యూరీపై విమర్శలు మొదలయ్యాయి.