తన భర్త రితేష్ తన కళ్ల ముందే నటి ప్రీతి జింటా చేతులకు ముద్దు పెట్టుకోవడంతో తెగ ఫీల్ అవుతుంటుంది. రితీష్- ప్రీతి జింటాలను చూసి జెనీలియా జలస్‌గా చూస్తున్న ఎక్స్ప్రెషన్స్ వీడియోలో చాలా క్లియర్‌గా కనిపిస్తుంటుంది. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ విషయం జెనీలియా మరోసారి స్పందించింది. మరో వీడియోను సోషల్ మీడియా లో పోస్ట్ చేసింది. ఫంక్షన్ అనంతరం ఇంటికి వెళ్లిన తర్వాత ఏం జరిగిందో తెలుసా అంటూ రితేష్‌ను చితకబాదుతూ ఓ ఫన్నీ వీడియోను రూపొందించింది.