కృష్ణవంశీ దర్శకత్వంలో గులాబీ చిత్రం తెరకెక్కిస్తున్న సమయంలో హీరోగా నటిస్తున్న జె.డి.చక్రవర్తి తో గొడవ జరిగిందన్న మాట వాస్తవమే.. అయితే ఈ గొడవకు కారణం చిన్నపాటి అవగాహన లోపం అని, అలాగే పరోక్షంగా హీరోయిన్ మహేశ్వరి కూడా కారణమంటూ చెప్పుకొచ్చాడు. ఇప్పుడు అలాంటిది ఏమీ లేవని మంచి స్నేహితులుగా ఉన్నామని తెలిపారు.హీరోయిన్ రమ్యకృష్ణ మొదటి సారిగా నిన్నే పెళ్ళాడుతా సినిమా షూటింగుల్లో చూశానని చెప్పాడు. అది కాస్తా వారి పరిణయానికి దారి తీసింది అని చెప్పుకొచ్చాడు. వారిద్దరు ఎప్పుడూ ఒకరికి ఒకరు ప్రేమిస్తున్నట్లు చెప్పుకోలేదనీ, తమ ఇద్దరి మధ్య ఉన్నటువంటి బంధమే ఒకటిగా చేసింది అని చెప్పుకొచ్చాడు.