"ఫుల్ నరేషన్ ఇస్తే.. సినిమా చేయడానికి నేను రెడీ," అని ఎన్టీఆర్ బంపర్ ఆఫర్ ఇచ్చినప్పటికీ బుచ్చిబాబు తన దగ్గర పూర్తి కథ లేదని సైడ్ అయిపోయారనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే మరో ఆరేడు నెలల లోపు ఎన్టీఆర్ కోసం తాను కథను సిద్ధం చేస్తానని.. అంతవరకు వెయిట్ చేయాలని నిర్మాతలకు బుచ్చిబాబు చెబుతున్నట్టు ఇన్సైడ్ టాక్.