బుల్లితెరపై యాంకర్ శ్రీముఖీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె అందంతో అల్లరితనంతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇక చిలిపితనానికి ఆమె చిరునామా.. కొంటెదనానికి వీలునామా అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తారు. బుల్లితెరపై ఆటపాటలతో .. అరుపులతో సందడి చేసే శ్రీముఖికి భారీసంఖ్యలో అభిమానులు ఉన్నారు.