తెలంగాణలో ఆల్రడీ స్కూల్స్ మూసేశారు. ఇక థియేటర్ల విషయంపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే ఒకటి రెండు రోజుల్లో సినిమా థియేటర్లు, మాల్స్ తెరచి ఉంచే విషయంపై కూడా పూర్తి క్లారిటీ వస్తుందని అంచనా వేస్తున్నారు. తెలంగాణలో మరోసారి కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో సినిమా హాళ్లను తిరిగి మూసివేయాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ప్రభుత్వానికి ప్రతిపాదించింది. పూర్తిగా మూసివేయడం కుదరకపోతే గతంలోలాగే 50శాతం ఆక్యుపెన్సీ నిబంధన అమలుకి తేవాలని సూచించింది. ప్రభుత్వం దీనిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.