రామ్ చరణ్ ఇటు ఆర్ఆర్ఆర్ లో హీరోగా, అటు తండ్రి చిరంజీవి సినిమాకు నిర్మాతగా బాగా బిజీ అయిపోయాడు. అయితే ఆయన గత చిత్రాలకు, రాబోయే సినిమాకు మధ్య బాగా గ్యాప్ ఉందన్నమాట వాస్తవం. ఆర్ఆర్ఆర్ తర్వాతయినా రామ్ చరణ్ స్పీడందుకుంటాడేమోనని ఆశించారంతా. అది కూడా కుదిరేట్టు లేదని తెలుస్తోంది. ఆర్ఆర్ఆర్ తర్వాత చరణ్ హీరోగా దర్శకుడు శంకర్ ఓ సినిమా తీయాలనుకున్నాడు. ఇప్పుడీ సినిమాకు ఓ బాలీవుడ్ హీరో అడ్డు వస్తున్నాడు.