కేంద్ర ప్రభుత్వం 67 వ జాతీయ అవార్డులను ప్రకటించింది. 2019 సంవత్సరానికి గాను ఈ అవార్డులను ప్రకటించడం జరిగింది.. అయితే జాతీయ అవార్డులకు ఎంపికైన చిత్రాలలో జెర్సీ, మహర్షి చిత్రాలకు నేషనల్ అవార్డు దక్కడం విశేషం. అయితే ఇందులో జెర్సీ కి రెండు అవార్డులు, మహర్షికి రెండు అవార్డులు దక్కాయి. జెర్సీ సినిమా కు నేషనల్ అవార్డు లభించడం ద్వారా సినిమా యూనిట్ అంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే మరోవైపు మహర్షి చిత్రానికి కూడా నేషనల్ అవార్డు రావడంపై కొంత ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు..