'భూల్ భూలయ 2' సినిమాలో హీరో అయిన కార్తీక్ ఆర్యన్ కి నిన్న కరోనా సోకినట్లు తెలుస్తోంది. రిజల్ట్ పాజిటివ్ రావడంతో వెంటనే షూటింగ్ కు ప్యాకప్ చెప్పేసి హోమ్ క్వారంటైన్ కు వెళ్ళిపోయాడట. అదే షూటింగ్ టైమ్ లోనే హీరోయిన్ కియారా అలాగే టబు కూడా ఒక ప్రోగ్రాం లో పాల్గొన్నారట. హీరో కార్తీక్ ఆర్యన్ కు కరోనా అని తెలిసిన వెంటనే వీరిద్దరూ షాక్ కు గురయ్యారని తెలుస్తోంది.ఇక వీరిద్దరూ ఆలస్యం చేయకుండా ఐసోలేషన్ వార్డులో చేరిపోయారాట. కానీ కియారా వయస్సు 28 సంవత్సరాలు కాబట్టి పర్వాలేదు. కానీ టబు గారి వయస్సు 50 సంవత్సరాలు.. అందుకే ఆమె టెన్షన్ పడుతోందట.ఈ నేపథ్యంలో ఆమెకు రెండు రోజుల తర్వాత ఆర్టి పిసిఆర్ టెస్ట్ చేస్తారట. వీలైతే వ్యాక్సిన్ కూడా వేయించుకోవాలని ఆమె డిసైడ్ అయిందట