కన్నడ బ్యూటీ రష్మిక మంథన.. తెలుగులో లక్కీగర్ల్ గా పేరు తెచ్చుకుంది. వరుస హిట్స్ తో దూసుకెళ్తోంది. ఇప్పటి వరకూ కన్నడ, తెలుగు మూవీస్ లోనే నటించిన ఈ యంగ్ బ్యూటీ.. తొలిసారిగా తమిళ్ మూవీ చేసింది. హీరో కార్తికి జంటగా సుల్తాన్ మూవీలో ఆడిపాడింది. ఏప్రిల్ లో విడుదల కాబోతున్న ఈ సినిమా ట్రైలర్ ఇటీవలే విడుదలైంది. అయితే కార్తికంటే ముందు తమిళ్ లో సూర్య హీరోగా నటించే ఓ సిినిమాలో రష్మికకు అవకాశమొచ్చిందట. వివిధ కారణాలతో రష్మిక ఆ సినిమాను వద్దని చెప్పిందట. ఆ తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు రష్మికకు తమిళ డెబ్యూమూవీ కార్తితో సాధ్యమైంది. అన్న సూర్యతో సినిమా క్యాన్సిల్ అయినా, తమ్ముడు కార్తితో సినిమాతో తమిళ్ లో ఎంట్రీ ఇస్తోంది రష్మిక.