వకీల్ సాబ్ సినిమా విడుదల తేదీ దగ్గరపడుతుండే కొద్దీ నిర్మాత దిల్ రాజులో టెన్షన్ పెరిగిపోతోంది. ఓవైపు తెలంగాణలో కరోనా కేసుల పెరుగుదలతో స్కూల్స్ మూసివేశారు. మరోవైపు థియేటర్లు మూసేస్తారన్న ప్రచారం జరుగుతోంది. మంత్రి తలసాని శ్రీనివాస్ క్లారిటీ ఇచ్చినా కూడా పరిస్థితి చూస్తుంటే ఏ క్షణాన ఏ నిర్ణయం తీసుకుంటారో అనిపిస్తోంది. మరోవైపు వకీల్ సాబ్ ఫంక్షన్ పై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కరోనా కేసులు పెరుగుతున్న ఈ దశలో భారీ సంఖ్యలో అభిమానులు పోగయ్యే సినిమా ఫంక్షన్లకు ప్రభుత్వం అనుమతిస్తుందా, ఒకవేళ ఇచ్చినా సామాజిక దూరం, మాస్క్ ల వంటివి ఎంతవరకు సాధ్యం అనే అనుమానాలు మొదలయ్యాయి.