తెలుగు చిత్ర పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవికి ఎంత క్రెజ్ ఉందో.. అతని తనయుడు రామ్ చరణ్ కి కూడా అంతే క్రెజ్ ఉంది. ఇక రామ్ చరణ్ మొదటి సినిమా డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ దర్శకత్వంలో చిరుత అనే టైటిల్ తో చేసాడు. ఈ సినిమా మాస్ ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంది. ఆతర్వాత దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన మగధీర సినిమా రామ్ చరణ్ కెరియర్ నే మలుపు తిప్పింది.