నాగార్జున 100వ చిత్రంపై ఇప్పటికే అనేక చర్చలు జరుగుతున్నాయి. నివేదికల ప్రకారం నాగార్జున తన తనయుడు అక్కినేని అఖిల్ తో కలిసి తన 100వ చిత్రాన్ని ప్లాన్ చేయనున్నారట. తన 100వ చిత్రం లో అఖిల్ కి ఫాదర్ క్యారెక్టర్ లో నటించాలని నాగార్జున అనుకుంటున్నారని.. అందుకు తగ్గట్టుగా ఒక స్క్రిప్ట్ తయారు చేయడానికి పలు రచయితలు ముందుకు వచ్చారని సమాచారం.