తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్టీఆర్ తో ఎన్నో సినిమాల్లో సూపర్ స్టార్ కృష్ణ పోటీపడినప్పటికీ రాజకీయ రంగంలోకి మాత్రం కృష్ణ మొదట్లో రాలేదు. నిజానికి కృష్ణ తీసిన 200వ చిత్రం ఈనాడు సినిమా ఎన్టీఆర్ టీడీపీ విజయానికి పరోక్షంగా దోహదం చేసింది. ఎన్టీఆర్ గెలిచాక ఈనాడు 100రోజుల సందర్బంగా ఎన్టీఆర్ కి అభినందనలు తెల్పుతూ కృష్ణ ప్రకటన కూడా ఇచ్చాడు.