దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవడం ఈ తరం నటీమణులకు బాగా తెలుసు. క్రేజ్ ఉండగానే దాన్ని క్యాష్ చేసుకునే ఉద్దేశంతో.. న్యూస్ రీడర్ గా ఉన్న అనసూయ క్రేజీ యాంకర్ గా అవతారమెత్తారు. ఆ తర్వాత బుల్లితెర ప్రేక్షకుల హృదయాలను పూర్తిగా దోచుకున్నారు. స్టేజ్ షోలతో కూడా మంచి పేరు సంపాదించారు. ఇటీవల పూర్తిగా సినీ ఇండస్ట్రీపై కన్నేశారు రంగమ్మత్త. రంగస్థలం మూవీ ఆమె కెరీర్ ని పూర్తిగా మార్చేసిందని చెప్పాలి. నటనకు స్కోప్ ఉన్న పాత్రలో నటించి తనని తాను ప్రూవ్ చేసుకున్న అనసూయ.. సినిమాలపై ఫోకస్ పెంచారు.