తెలుగు చిత్ర పరిశ్రమలో కాజల్ అగర్వాల్ గురించి తెలియని వారంటూ ఉండరు. ఆమె నటనతో కోట్లాది మంది ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకుంది. ఇక తాజాగా కాజల్ తెలుగులో నటిస్తోన్న తాజా చిత్రం విషయానికి వస్తే.. ఆమె మొదటిసారి నాగార్జున సరసన నటిస్తోంది. కింగ్ నాగార్జున హీరోగా `గరుడవేగ` ఫేమ్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో వస్తున్న ఓ యాక్షన్ థ్రిల్లర్ రూపోందుతుంది.