నాగ శౌర్య హీరోగా సంతోష్ జాగర్లమూడి దర్శకత్వంలో రూపొందించుతున్న చిత్రం 'లక్ష్య' . సోనాలి నారంగ్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర మూవీస్ ఎల్ ఎల్ పి, నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై నారాయణ దాస్ కె. నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు, శరత్ మరార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.. ఈ చిత్రం "లక్ష్య" లో నాగ శౌర్య కి జోడిగా కేతిక శర్మ హీరోయిన్ గా నటిస్తోంది. అంతేకాకుండా ఈ చిత్రంలోని కీలక పాత్రలో విలక్షణ నటుడు జగపతిబాబు, సచిన్ ఖేడేకర్ కూడా నటిస్తున్నారు.నాగశౌర్య 20వ చిత్రంగా ప్రాచీన విలువిద్య నేపథ్యంలో స్పోర్ట్స్ బేస్డ్ ఫిలింగా అన్ని కమర్షియల్ హంగులతో తెరకెక్కిస్తున్నారు