ప్రముఖ దర్శకుడు ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న మల్టీస్టారర్ సినిమా ఆర్ఆర్ఆర్పై అందరికీ అంచనాలు ఎక్కువే ఉన్నాయి. బహుబలి బిగినింగ్, ఎండింగ్ మూవీస్ తీసి ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమా సత్తాను చాటి చెప్పారు దర్శకుడు రాజమౌళి. అందుకే తెలుగు చిత్ర పరిశ్రమలో ఇప్పుడు ఆర్ఆర్ఆర్ సినిమాపై ఎప్పుడూ కొత్త కొత్త వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి.