తెలుగు చిత్ర పరిశ్రమలో శర్వానంద్ గురించి తెలియని వారంటూ ఉండరు. ఆయన నటనతో ఎంతో మంది ప్రేక్షకుల అభిమానాన్ని పొందాడు. తన బాడీ లాంగ్వేజ్ కి తగిన కథలను ఎంచుకుంటూ వెళుతున్నాడు. నాని తరువాత కథల విషయంలో అంతటి ప్రత్యేక శ్రద్ధ పెట్టే హీరోగా శర్వానంద్ కనిపిస్తాడు. తెరపై శర్వానంద్ నటన నిలకడగా .. నిబ్బరంగా ఉంటుంది.