ఎన్టీఆర్ నెక్స్ట్ సినిమాకి సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ సినీ వర్గాల్లో చాలా వేగంగా వ్యాప్తి చెందుతుంది. అదేంటంటే ఆర్ఆర్ఆర్ తరువాత కూడా మళ్లీ రాజమౌళి, ఎన్టీఆర్ కలిసి ఒక సినిమా చేయనున్నారట. అది కూడా ఆర్ఆర్ఆర్ వంటి పాన్ ఇండియా మూవీనేనట. అయితే జూ.ఎన్టీఆర్ త్రివిక్రమ్, ప్రశాంత్ నీల్ లతో కలిసి తన తదుపరి చిత్రాలను పూర్తి చేసిన తర్వాత మళ్లీ రాజమౌళి, తారక్ కాంబో రిపీట్ కానుందని వార్తలు వస్తున్నాయి. ఒకవేళ ఈ వార్తల్లో నిజం ఉంటే ఎన్టీఆర్ అభిమానులు పండగ చేసుకోవడం ఖాయం.