తమన్నాభాటియా తెలుగులో " లెవెన్త్ హావర్" (11th hour) వెబ్ సిరీస్ లో నటించారు. ఈ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఆహా వేదికగా ఏప్రిల్ 9వ తేదీన ప్రసారం అవుతోంది. ఓ పుస్తకం ఆధారంగా రూపొందిన ఈ సిరీస్ పై భారీగానే అంచనాలు నెలకొన్నాయి. ఎనిమిది ఎపిసోడ్స్ తో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సిరీస్ సక్సెస్ అవుతుందో లేదో తెలియాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే. తమన్నా ఓటీటీ రంగంలో సక్సెస్ అవుతారా లేక కాజల్ లాగా పరాజయం పొందుతారా అనేది ఏప్రిల్ 9వ తేదీన తెలుస్తుంది.