విక్టరీ వెంకటేష్ గురించి ఒక లేటెస్ట్ అప్ డేట్ వచ్చింది. ప్రముఖ డైరెక్టర్ శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో మూవీ చేసేందుకు వెంకీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్. ప్రస్తుతం ఈ క్రేజీ కాంబినేషన్ గురించి అంతా మాట్లాడుకుంటున్నారు. సోషల్ మీడియాలో ఈ వార్త తెగ సందడి చేస్తోంది. ఈ వార్తలో ఎంత నిజముందో తెలియదు కాని వీరిద్దరి కాంబో మాత్రం సూపర్ హిట్ గా ఉంటుందని, వెంకీ నుండి ప్రేమించుకుందాం రా వంటి మరో లవ్లీ మూవీ వస్తుందని ఎక్ష్పెక్ట్ చేస్తున్నారు నెటిజన్లు.