తెలుగు సినీ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా, హీరో తల్లి పాత్రల్లో నటించి.. సినీ ప్రేక్షకులను అలరించిన వారిలో రూపలక్ష్మి ఒకరు. శ్రీ విష్ణు హీరోగా నటించిన నీది నాది ఒకటే కథ సినిమాలో హీరో తల్లి పాత్రలో నటించి.. మంచి డైలాగులు, కామెడీ పంచులతో ప్రేక్షకులను ఎంతో అలరించారు. తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఓ ఇంటర్వ్యూలో ఆమె పాల్గొన్నారు.