తెలుగు చిత్ర పరిశ్రమలో న్యాచురల్ స్టార్ నాని గురించి తెలియని వారంటూ ఉండరు. ఆయన నటనతో కోట్లాది మంది తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. తెలుగు చిత్ర పరిశ్రమకు అష్టాచెమ్మాతో మొదలైన నాని ప్రయాణం ఇటీవలే వచ్చిన ‘వి’ సినిమా వరకు ప్రేక్షకులను అలరిస్తునే ఉన్నాడు. మొదటి సినిమాతోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొని వరుస ఆఫర్లను అందుకున్నాడు నేచురల్ స్టార్.