టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ ప్రభాస్ పెళ్లి గురించి వచ్చిన ఏ వార్త అయినా ఆసక్తికరంగానే ఉంటుంది. సోషల్ మీడియాతోపాటు, మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా అవే వార్తలపై ఫోకస్ పెడతాయి. ఈమధ్య కాలంలో ప్రభాస్ పెళ్లి వార్తల గురించి గాసిప్స్ పూర్తిగా ఆగిపోయాయి. వరుస సినిమాలతో రెబల్ స్టార్ బిజీ అయిపోవడంతో పెళ్లి వ్యవహారాన్ని పూర్తిగా పక్కనపెట్టారనే అనుకున్నారంతా. అయితే అనుకోకుండా మళ్లీ ప్రభాస్ పెళ్లి వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఆదిపురుష్ సినిమా తర్వాత ప్రభాస్ పెళ్లిపీటలెక్కుతారని అంటున్నారు.