హీరో గోపీచంద్ చాన్నాళ్లుగా హిట్ మూవీకోసం ఎదురు చూస్తున్నారు. వరసబెట్టి సినిమాలు చేస్తున్నా కెరీర్ ని గాడిలో పెట్టే హిట్ ఒక్కటీ పడటంలేదు. అయితే సినిమా సినిమాకీ గోపిచంద్ నటుడిగా ప్రూవ్ చేసుకుంటున్నారు, మంచి సినిమాలు చేస్తున్నారనే పేరు కూడా వస్తోంది. హిట్ ఒక్కటే అందని ద్రాక్షలా మారింది. తాజాగా సీటీమార్ సినిమాతో మాంచి మాస్ హిట్ కొడతామనుకుంటున్న గోపీచంద్ రిలీజ్ డేట్ దగ్గరపడేసరికి వెనకడుగేయడం ఇప్పుడు చర్చనీయాంశం అయింది. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో.. సినిమా హాళ్లంటే జనాలు భయపడే పరిస్థితుల్లో సీటీమార్ వాయిదా వార్త బయటకొచ్చింది.