సీరియల్ నటి అను శ్రీ ఎక్కువగా నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలలో నటించడం వల్ల చాలామంది తనని అపార్థం చేసుకున్నారని ఆమె చెప్పుకొచ్చారు. అంతటితో ఆగకుండా సోషల్ మీడియాలో అసభ్యకరమైన కామెంట్స్ చేస్తూ బాగా బాధ పెట్టారని ఆమె కంటతడి పెట్టుకున్నారు. బ్యాడ్ కామెంట్ చేస్తే ఎదుట వ్యక్తి ఎంత మానసిక క్షోభకు గురవుతాడో మాటల్లో వర్ణించలేం అని ఆమె చెప్పుకొచ్చారు. అయితే ప్రతిరోజు తనపై నెగిటివ్ కామెంట్స్ వస్తుండడం చూసి చివరికి తన పాత్రని ప్రేక్షకులు బాగా అర్థం చేసుకోవడం వల్లనే ఇలా తనని తిట్టిపోస్తున్నారని ఆమె అర్థం చేసుకున్నారట. ఇక ఆ తర్వాత ఆమె ఎప్పుడూ బాడ్ కామెంట్స్ గురించి ఆలోచించలేదని చెబుతున్నారు.